YS Vivekanada MurderCase: వైఎస్ వివేకా మర్డర్ కేసులో..పోలీసులకు కోర్టు బిగ్ షాక్
వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది.
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్మ.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?
కడప నాారాయణ కాలేజీ హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకున్న ఘటన జరిగింది. నిన్న ఆదివారం కావడంతో తల్లిదండ్రులు కొడుకుని చూడటానికి వెళ్లగా ఇంటికి వస్తానని మారం చేశాడు. తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Adinimmayapalli dam : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నేపాల్ కు చెందినవారు.
మేము ఇస్తేనే.. సీఎం పదవి నీకు | TDP Vs Janasena | Flexi War In Kadapa | Pawan Kalyan | Chandrababu
Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేడుకల కోసం కడప నుంచి గండికోటకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. జమ్మలమడుగు దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.
Kadapa: పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐపై దాడి
వైఎస్సార్ జిల్లాకి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. పోలీసులు వెంటనే కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. అయితే యాక్సిడెంట్‌కి కారణమైన వారిని ఎస్ఐ వదిలేశాడని గాయపడిన వారి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు.