Train Accident : రైలులో మంటలంటూ రుమార్స్..భయంతో పరుగులు..మరో రైలు ఢీకొట్టి!
ఝార్ఖండ్ లాతేహర్లో ససారాం- రాంచీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరవడంతో రైలులోని వారు కిందకి దిగి పరుగులు పెట్టారు. దీంతో పక్క ట్రాక్ లో వస్తున్న గూడ్స్ ఢీకొట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.