Jharkhand: జేఎంఎంలో అవమానాలు..అందుకే కొత్త పార్టీ: చంపయీ సోరెన్! ఝార్ఖండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతుంది. జేఎంఎంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నానని అందుకే కొత్త పార్టీని పెడుతున్నట్లు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరేన్ తెలిపారు. తాను బీజేపీలో చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. By Bhavana 22 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Jharkhand: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జార్ఖండ్ లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జేఎంఎం నేత మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరేన్ బీజేపీలో చేరుతారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతుంది. అయితే తాజాగా ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నానని చెప్పి అందర్ని షాక్ కి గురి చేశారు. ఎంతో మంది తనకు మద్దతుగా ఉన్నారని, ఇది తన జీవితంలో ఓ కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. ఒక కొత్త పార్టీని ప్రారంభించి, దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నానని, తన ప్రయాణంలో ఒక మంచి మిత్రుడు కలిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తానని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించారు. జేఎంఎంలో ఇటీవల అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సొంత పార్టీ అధినాయకత్వంపైనే జార్ఖండ్ టైగర్ గా పేరొందిన చంపయీ సొరేన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని... ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన సమయం తనకు ఆసన్నమయిందని తెలిపారు. మరోవైపు ఈ పరిణామాలపై హేమంత్ తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల ప్రకటనను కూడా ఆలస్యం చేస్తున్నారని విమర్శలు కురిపించారు. Also Read: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య! #chapay-soren #politics #jharkhand #new-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి