Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 9 మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడిపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో వెంటనే భద్రతా బలగాలను మోహరింపజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.