Terror Attack: భారత్‌లో కల్లోలానికి ఉగ్రవాదుల ప్లాన్ జమ్మూ-కశ్మీర్‌లో కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహత్తుల్లో భరత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్‌కర్ణి. అమర్‌నాథ్ యాత్రలో కల్లోలం సృష్టించాలనుకున్నారని తెలిపారు. By Manogna alamuru 15 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Jammu-kashmir: జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ముగ్గురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. కుప్వారా జిల్లా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ (Indian Army) ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి టెర్రరిలస్టులు చొరబాటుకు యత్నించారు. దీంతో వాళ్లపై భద్రతా దళం కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ తర్వాత వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఆదివారం ధనుష్ – 2 (Dhanush – 2) అనే కోడ్ పేరుతో కుప్వారాలోని కేరన్ సెక్టర్‌లో టెర్రరిస్టులను ఏరివేత ఆపరేషన్‌ను భద్రతా బలగాలు చేపట్టాయి. ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ దాడి వెనుక ఉగ్రవాదులకు చాలా పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు. అమర్‌నాథ్ యాత్రలో కల్లోలం సృష్టించే ఆలోచన ఉందని చెబుతున్నారు కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్‌కర్ణి. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని.. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారని తెలిసిందని చెప్పారు. దీన్నిజమ్మూ-కశ్మీర్ పోలీసులు ధృవీకరించారని తెలిపారు. అందుకే జూలై 13 నుంచి తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిపిన కాల్పుల్లో ఆర్మీ, బీఎస్‌ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తంగా పాల్గొన్నారు. ఆ సమయంలో చీకటిగా ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. కానీ భారత ఆరమీ మాత్రం పట్టువదలకుండా వారిని మట్టుబెట్టారు. టెర్రరిస్టుల దగ్గర భారీ ఆయుధాలున్నాయి. బాగా శిక్షణ పొందన ఉగ్రవాదులే చొరబాటుకు ప్రయత్నించారు. తాము ముగ్గురిని అయితే హతం చేశాము కానీ దీని వెనుక ఇంకెంత మంది ఉన్నారో తెలియాల్పి ఉందని బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్‌కర్ణి చెప్పారు. #jammu-kashmir #terrorists #indian-army #attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి