జమ్మూలో దాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థే కారణం..NIA జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.అయితే గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని NIA పేర్కొంది. By Durga Rao 08 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి జమ్మూకశ్మీర్‌లో గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని ఎన్ఐఏ పేర్కొంది. జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేసి ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గత దాడి వివరాలు: * జూన్ 11న చట్రకళ్లలోని చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆరుగురు భద్రతా దళ సిబ్బంది గాయపడ్డారు. * జూన్ 26న తోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. * జూలై 6న కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఆరుగురు ఉగ్రవాదులను కాల్చిచంపారు. ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. #jammu-kashmir #nia #terrorists మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి