/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4.jpg)
Rasheed Oath : ఎంపీ రషీద్ ప్రమాణం స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరో నాలుగు రోజుల తర్వాత అంటే జూలై 5న రషీద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షరతులతో కూడిన ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ (NIA) అనుమతినిచ్చింది. కాగా, షరతులకు సంబంధించి ఢిల్లీ (Delhi) లోని పటియాలా హౌస్ కోర్టు జూలై 2న తుదితీర్పు ఇవ్వనుంది.
ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ (Interim Bail) లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజినీర్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. టెర్రరిస్టులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింది ఎన్‌ఐఏ 2019లో ఆయనను అరెస్టు చేసింది.