Israel: గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు..85 మంది మృతి
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా చేసిన దాడుల్లో 85 మంది మరణించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చేసిన వైమానిక దాడుల్లో 400 మంది చనిపోయారు.
గాజా ప్రజలకు మానవత సాయం కూడా సరిగా అందడం లేదు. దీంతో అక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. గాజా ప్రజలకు మానవతా సాయం సరఫరా నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చింది. బంధీలను విడిచిపెట్టాలని కోరింది.
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.
గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
వెస్ట్‌బ్యాంక్‌లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్‌పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట.
హమాస్ మరోసారి ట్రంప్ వార్నింగ్‌ను పక్కనపెట్టింది. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇజ్రాయెల్ లో జనంపైకి కారు దూసుకెళ్ళింది. ఇది అక్కడ కలకలం రేపింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ఉగ్రదాడేమోనని అక్కడి భద్రతా సిబ్బంది భావిస్తున్నారు.