UK: ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ఎంపీలు నిర్బంధం..

ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది.

New Update
Two UK MPs denied entry to Israel

Two UK MPs denied entry to Israel

ఇజ్రాయెల్-, హమాస్‌ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ధ్వజమెత్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ కూడా శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

అక్కడికి చేరుకున్నాక అధికారులు వాళ్లని అడ్డుకొని నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అయితే భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచడం కోసమే ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది. అందుకే వాళ్ల రాకను అధికారులు అడ్డుకున్నారని చెప్పింది. సమాచారం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చారని ప్రశ్నించింది. అయితే ఇజ్రాయెల్ చర్యలపై యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

డేవిడ్ లామీ మాట్లాడుతూ '' ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు యూకే ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది సరైంది కాదు. వాళ్ల చర్య ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వాళ్లు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు చెప్పాను. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని'' అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

telugu-news | rtv-news | britain | israel | hamas-israel | hamas-israel-war

#telugu-news #rtv-news #israel #britain #hamas-israel-war #hamas-israel
Advertisment
తాజా కథనాలు