Israel: హమాస్ సైనిక నిఘా చీఫ్ ఒసామా టబాష్ అంతం

హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్ గా ఉన్న ఒసామా టబాష్ ను అంతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో ఒసామా మరణించాడని క్ఫన్ఫార్మ్ చేసింది. అయితే దీనిపై హమాస్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

New Update
hamas

Hamas military intelligence chief osama

హామాస్ లక్ష్యాలను నిర్దేశించే టార్గెటింగ్ యూనిట్ చీఫ్ ఒసామా టబాష్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందాడు. దీనిని ఐడీఎఫ్ ధృవీకరించింది.   దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో ఒసామా మరణించాడని క్ఫన్ఫార్మ్ చేసింది. అయితే దీనిపై హమాస్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 

వరుసపెట్టి దాడులు..

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం మూడు రోజుల క్రితమే ముగిసింది. అప్పటి నుంచీ ఇజ్రాయెల్ గాజా పై దాడులు మొదలుపెట్టింది. వైమానిక దాడులు చేస్తూ భీభత్సం సృష్టిస్తోంది. హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందానికి హమాస్ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అలాగే అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. అందుకే దాడులు చేస్తున్నామని అన్నారు. తాజాగా చేసిన అటాక్ లో 85 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో పౌరులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అంతకు మందు చేసిన దాడుల్లో 400 మంది గాజా పౌరులు మరణించారు. 

 today-latest-news-in-telugu | israel | hamas | hamas-military-chief

 

Also Read: India-China: లడక్ లో చైనా కౌంటీలు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు