Israel Iran War Live| భీకర యుద్ధం | Israel Attack Updates | Israel Vs Iran Latest News | RTV
పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్..
ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.
'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు.
వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.
Israel-Iran : నస్రల్లా అల్లుడు కూడా మృతి!
గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు అతని కుమార్తె కూడా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా లెబనాన్ లో జరిగిన దాడుల్లో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ - ఖాసిర్ సైతం మరణించాడు.
America : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!
మధ్యప్రాచ్యంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో జీ-7 దేశాలు ఏకకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించనున్నట్లు నిర్ణయించాయి.ఇజ్రాయెల్, ఆ దేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ పూర్తి సంఘీభావం ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు.
ముస్లిం దేశాలను గెలకడమే ఇజ్రాయెల్ పనా? చరిత్ర ఏం చెబుతోంది?
పొద్దున లేస్తే చాలు ఏ దేశంపై బాంబులు వెయ్యాలన్న ఆలోచన ఇజ్రాయెల్ సైన్యానిది! ఇదేదో ఏడాది నుంచో రెండేళ్ల నుంచో జరుగుతున్న తంతు కాదు.. ఆ దేశ చరిత్రంతా ఇంతే! ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు
ఇజ్రాయెల్ మీద నిఘా ఉంచమని పంపితే చివరకు మాకే శత్రువుగా మారాడు అని గగ్గోలు పెడుతోంది ఇరాన్. తాము ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/xr2XR3Wu6AJl4xtnQMcS.jpg)
/rtv/media/media_files/8LChC2kouRtgn9SDQQin.jpg)
/rtv/media/media_files/Z9gSQ4dv0LGV4pXLmYkT.jpg)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/l9cWXIvD0woloanzI6bX.jpg)
/rtv/media/media_files/ifZO7vJuTGpp50HXxccS.jpg)
/rtv/media/media_files/NFcP99PWfktUSTyQ6agp.jpg)
/rtv/media/media_files/gs0O37pTZuWjkUplKYYj.jpg)