మెట్రో సంస్థకు మొట్టికాయలు..రూ. 6 వేలు జరిమానా..!!
హైదరాబాద్ మెట్రో సంస్థకు వినియోగదారుల కమిషన్ రూ.6 వేల ఫైన్ విధించింది. మెట్రో స్టేషన్లో తప్పుడు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగింది. అతడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా.. ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ప్రయాణకుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.