కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్‌మెంట్లు ఖాళీ తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. By srinivas 09 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Hyderabad Metro : తెలంగాణ(Telangana) లో ఫ్రీ బస్సు జర్నీ శనివారం మధ్యాహ్నం ప్రారంభించడంతో బస్టాండ్ లు కిటకిటలాడుతున్నాయి. ఇన్నాళ్లు ఆడపాదడపా ప్రయాణికులతో పరిగెత్తిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉచిత బస్సు జర్నీ మెట్రో (Metro), ఆటో, క్యాబ్ లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా నిరంతరం ప్రయాణికులతో రద్దీగా కనిపించే హైదరాబాద్ మెట్రో జనాలు లేక వెలవెలబోయింది. బస్సు ఫ్రీ టికెట్ ప్రారంభించిన మొదటిరోజే మెట్రో స్టేషన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రారంభించారు. మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన 'మహాలక్ష్మి పథకం', 'ఆరోగ్య శ్రీ'(Arogya Sri) పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని అధికారికంగా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. అయితే ఈ ఫ్రీ బస్సు జర్నీ కారణంగా బస్టాండ్ లు కిటకిటలాడుతుండగా మెట్రో, ఆటోలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా కనిపించాయి. సికింద్రాబాద్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లోనూ గిరాకీ లేక ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో గిరాకీ లేక ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. తమగురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, త్వరలోనే తన తరఫున ప్రభుత్వానికి వినతిపత్రం ఇస్తామని చెబుతున్నారు. Also read : బస్సు ఫ్రీ అని భార్యలు ఊర్లు తిరిగితే.. భర్తలంతా బార్లకే.. ఫన్నీ మీమ్స్ వైరల్ ఇక కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగామహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. #metro #free-journey #rtc #congress-party #telangana #hyderabad-metro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి