/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Minister-Harish-Rao-jpg.webp)
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) సింప్లిసిటీకి మారుపేరన్న విషయం తెలిసిందే. ఆయన రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేశారని, టీ తాగారని, సిద్దిపేట కోమటి చెరువు వద్ద కాలినకన తిరుగుతూ సామాన్యులతో ముచ్చట పెట్టారని.. ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన మెట్రో రైళ్లో సామాన్య ప్రయాణికుడి మాదిరిగా ప్రయణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి:KCR : మేము ఓడింది అందుకే.. 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
నిన్న నాగోల్ లోని శిల్పారామంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు.. అనంతరం రవీంద్రభారతిలో తెలుగు అమెరికా సంఘం ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో తన వాహనాన్ని వదిలి ఎల్బీనగర్ వద్ద మెట్రో ఎక్కారు హరీశ్ రావు.
Former Miinister and Siddipet BRS MLA, T Harish Rao interacts with Hyderabad Metro commuters while traveling from L B Nagar to Lakdi ka Pul on Saturday.@XpressHyderabadpic.twitter.com/UyLhJNwusp
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) December 30, 2023
Brs Mla Harish rao travels in Hyderabad Metro #harishrao#BRSParty@BRSparty#TelanganaNewspic.twitter.com/gcRAFLnifo
— Naveen Sayeni (@NaveenSayeni) December 30, 2023
అక్కడి నుంచి లక్డీకపూల్ వరకు ప్రయాణించారు. మెట్రోలో ప్రయాణిస్తున్నంత సేపూ సాధారణ ప్రయాణికులతో ముచ్చట పెడుతూ వాళ్ల యోగక్షేమాలను అడుగుతూ తనదైన శైలిలో సరదాగా గడిపారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.