Weather Alert: మరో నాలుగు రోజులు వానలే వానలు..
రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 15వరకు ఇదే వాతావరణం ఉంటుందని పేర్కొంది.
బ్రెజిల్లో సంభవించిన వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటి ప్రభావం వల్ల ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు లక్ష ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో బుధవారం వర్షాలు పడతాయిని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, నెల్లూరు, బాపట్ల, అల్లూరి, చిత్తూరు, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో బుధవారం పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షం రావడంతో ప్రజలు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు. నగరంలో ఈదురుగాలులు, ఉరుములతో బీభత్సం సృష్టించాయి. సాయంత్రం 4 గంటలకే కారు మబ్బులు కమ్మేశాయి. సిటీలో పలు చోట్ల హోర్డింగ్స్, చెట్లు కూలిపోయాయి.
గత కొన్నిరోజులుగా బ్రెజిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల ధాటికి ఇప్పటివరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా తెలిపింది. సుమారు లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
దేశవ్యాప్తంగా ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు జమ్మూ-కశ్మీర్ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల చాలాచోట్ల రోడ్లు తెగిపోగా, ఇండ్లు నీటమునగడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటలపాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు కోరారు.
దుబాయ్ నగరాన్ని ఉన్నట్టుండి వానలు ముంచెత్తాయి. మొత్తం నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడివక్కడ నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది.
వేసవి వేడితో అదిరిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకువచ్చింది. ఈ ఏడాది ఎండలు ఎంత ఎక్కువ ఉన్నాయో.. అలానే వర్షాలు కూడా అంతే ఎక్కువగా ఉండొచ్చని IMD తన అంచనాలలో పేర్కొంది. రుతుపవనాల సీజన్లో వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది.