Pithapuram Floods: పిఠాపురాన్ని ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగిన వాయుగుండం... పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.
ఉత్తరాంధ్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్థానిక ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. నున్న ప్రాంతం సమీపంలో టాటా కార్ల షోరూం నీట మునిగింది. షోరూం గ్రౌండ్లో దాదాపు 300 కొత్త కార్లు పార్కు చేయగా.. వరద ప్రభావానికి అవి మునిగిపోయాయి.రూ.కోట్లల్లో నష్టం జరిగిందని షోరుం సిబ్బంది వాపోయారు.