Khammam floods: ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రానున్న 3 రోజులు భారీ వర్షాలు పడు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మంతో పాటు ఎగువనున్న జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 – 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర యానాం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Khammam floods: ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే!
ఖమ్మంకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మంతో పాటు తెలంగాణలోని 11 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Translate this News: