Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.
తమిళనాడులోని మధురైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు దత్తనేరి, పాలగంఠాలు నీట మునిగాయి. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వనపర్తి, నారాయణపేట, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, కామారెడ్డిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు వివరించారు.
ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వకు మరోసారి గండి పడింది. కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు గండి పడగా.. దానికి అధికారులు కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేశారు. తాజాగా కాలువకు మరోసారి గండి పడడంతో అధికారుల పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.