దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులకు ఓ వ్యక్తి చనిపోయాడు. మార్నింగ్ వాక్‌కు చేస్తున్న బిజినెస్ మ్యాన్‌పై దుండగులు కాల్పులు జరపారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పులు సంచలనంగా మారింది. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ ఏరియాతో (డిసెంబర్ 7) శనివారం ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి సునీల్ జైన్‌పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు #WATCH | Delhi | A person, Sunil Jain was found with gunshot injuries in the Farsh Bazar PS area. He was reported to have been shot by two persons who came on a motorcycle. The Crime Team has been called to the spot. Further investigation is in progress: DCP Shahdara(Visuals… pic.twitter.com/t2DEV2lkNy — ANI (@ANI) December 7, 2024 ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ జైన్‌ను కృష్ణా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఓ వ్యాపారవేత్త. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని రాణిభాగ్‌లో భామ్‌భీనా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధానిలోనే శాంతిభద్రతలు కరువైతే ఎలా అని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం