Israel hamas war: గాజాలో పెరుగుతున్న ఆకలి కేకలు.. ఆహారం కోసం ఎగబడుతున్న జనాలు..
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఆకలి కేకలు పెరుగుతున్నాయి. అక్కడ ఉంటున్న సామాన్య పౌరుల్లో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) ఆందోళన వ్యక్తం చేసింది. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని పేర్కొంది.