Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్
తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది.
తమ సంస్థ మీద వచ్చిన ఆరోపణల మీద అదానీ గ్రూప్ స్పందించింది. దీని మీద న్యాయపరంగా ముందుకు వెళతామని చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది.
అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఆయనపై కేసులు నమోదు అవ్వడంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ పడిపోయాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం, అదానీ గ్రీన్ షేర్లు 18 శాతం క్షీణించాయి.
గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ యాజమాన్యం కలిసింది. గౌతమ్ అదానీ, కరన్ అదానీ కలిసి రేవంత్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అదానీ ఫౌండేషన్.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్కును అందించింది.
భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది.ఇందులో ఎప్పుడూ మొదటి ప్లేస్‌లో ఉండే ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి అదానీ ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేశారు.
భారతదేశంతోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్ధానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2024లో 200 మంది భారతీయులు ఉన్నారు.
దాదాపు సంవత్సర కాలం తరువాత గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్ల ఎలైట్ క్లబ్ లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. బుధవారం నాడు ఒక్కరోజే అదానీ ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు పెరిగి... 100. 7 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది.