Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష! అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Seetha Ram 21 Nov 2024 in ఇంటర్నేషనల్ బిజినెస్ New Update షేర్ చేయండి ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు సైతం వచ్చాయి. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం అమెరికాలోని ఇన్వెస్టర్లు, వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి భారీగా నిధులు సేకరించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆ కాంట్రక్ట్‌ను దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు రూ.2,100 కోట్ల లంచాలు చెల్లించినట్లు అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్ దీంతో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా ఇన్వెస్టర్లను అదానీ మోసం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయి ఇండియాలో 20 ఏళ్ల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కాంట్రక్ట్ తనకే దక్కాలని అదానీ దాదాపు 2,100 కోట్లు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు ఇందులో భాగంగానే అదానీపై అమెరికాలోని ఈస్టర్న్ డిస్ట్రిక్ ఆఫ్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) పై కేసు నమోదు చేశారు. Also Read : చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్ చేసి..! నేరం రుజువైతే అదానీకి పడే శిక్ష ఎఫ్‌సీపీఏ చట్టం అమెరికాది కాబట్టి.. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ పై నేరం రుజువైతే అక్కడి రూల్స్ ప్రకారమే శిక్ష పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉంది. Also Read : HYDలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం సాక్ష్యాలు కూడా ఉన్నాయ్ భారత ప్రభుత్వ అధికారులకు రూ.2 వేల 100 కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధమైనట్లు సాక్ష్యాలు సైతం క్లియర్‌గా ఉన్నట్లు యూస్ అటార్ని కార్యాలయం నుంచి ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యాయి. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీ ఫోన్‌లో అధికారులకు ఇచ్చే లంచంకి సంంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయని అమెరికా న్యాయవాదులు ఆధారాలు చూపించారు. ఈ మేరకు డిటేల్ స్పెడ్ షీట్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఫొటోగ్రాఫ్స్ వంటివి సాగర్ వద్ద ఉన్నాయని తెలిపారు. Also Read : మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి! కేసులో ఉన్నవారు.. ఈ కేసులో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీ, యుఎస్ ఇష్యూయర్ మాజీ సీఈఓ రంజిత్ గుప్తా, ఇండియన్ ఎనర్జీ కంపెనీ మాజీ సీఈఓ ఎస్.జైన్ తో పాటు మొత్తం ఈ స్కామ్‌లో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. #america #india #adani-groups #gautam-adani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి