అదానీకి మరో బిగ్ షాక్.. షేర్లు అన్నీ ఢమాల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్

అదానీకి మరో బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఆయనపై కేసులు నమోదు అవ్వడంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు అన్నీ పడిపోయాయి. ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు పడిపోయాయి. అదే సమయంలో అదానీ ఎనర్జీ సోల్యూషన్స్ షేర్లు 20శాతం, అదానీ గ్రీన్ షేర్లు 18 శాతం క్షీణించాయి.

New Update
Adani Group companies

భారత అపర కుభేరుడు గౌతమ్ అదానీకి తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అమెరికాలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా రూ.2వేల 100 కోట్లు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అదానీ కంపెనీకి చెందిన షేర్లు ఒక్కసారిగా క్షీణించాయి. 

Also Read :  చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

20 శాతం షేర్లు పడిపోయాయి

ఇవాళ మార్కెట్ ఇలా ప్రారంభం అయిందో లేదో.. అలా అదానిపై అవినీతి ఆరోపణల వార్తలతో ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో అదానీకి సంబంధించిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రెడ్ అవుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో షేర్లు పడిపోయాయి. ఐదు కాదు పది కాదు ఏకంగా 20 శాతం వరకు అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. 

Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్

అదానీ గ్రీన్ షేర్లు పతనం

దీనికి ప్రధాన కారణం బిలియనీర్ అయిన అదానీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడమే. దీని కారణంగానే గురువారం అదానీ కంపెనీలకు చెందిన అన్ని షేర్ల ధరలు 20 శాతం క్షీణించాయి. అదే సమయంలో అదానీ గ్రీన్ షేర్లు కూడా పతనమయ్యాయి. దాదాపు 18 శాతం తగ్గుదలను అదానీ గ్రీన్ షేర్లు చవిచూశాయి.

Also Read: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్‌

ఇతర షేర్లు 10 శాతం క్షీణించాయి

ఇవి మాత్రమే కాకుండా అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏసీసీ, ఎన్డీటీవీ, అదానీ హోటల్ సహా ఇతర కంపెనీ 10 శాతం నేలకొరిగాయి. ఇది అదానీకి మరో పెద్ద షాకే అని చెప్పాలి. 

Also Read :  మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు.. వారే చంపేశారంటూ రోగి బంధువులు..!

Advertisment
తాజా కథనాలు