బీసీల జోలికొస్తే ఊరుకునేది లేదు
మంత్రి తలసాని నివాసంతో బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీసీ వర్గానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ బీసీలను, కుల వృత్తులను అవమానిస్తుందన్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు