భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? బండి సంజయ్ కి గంగుల సవాల్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. ప్రచారంలో డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేస్తావా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో తాను భారీ మెజారిటీతో గెలబోతున్నానంటూ గంగుల ధీమా వ్యక్తం చేశారు. By srinivas 29 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gangula Kamalakar: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాను భారీ మెజారిటీతో గెలబోతున్నానంటూ ధీమా వ్యక్తం చేశారు. రేపు జరగబోయేది తనకు నాలుగో ఎన్నిక అని, కరీంనగర్ ప్రజలు తనవైపై ఉన్నారని చెప్పారు. బుధవారం కరీంనగర్ పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కరీంనగర్ ను ఎంతో అభివృద్ధి చేసిన తనకు భారీ మెజారిటీ రాబోతుందన్నారు. అలాగే బీఆర్ఎస్ (BRS) హైట్రిక్ విజయం దిశగా ముందుకు వెళ్తుందని, దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇక తన ప్రత్యర్థి బండి సంజయ్ (Bandi Sanjay) గురించి సంచలన కామెంట్స్ చేసిన గంగుల (Gangula Kamalakar).. బండి సంజయ్ అకృత్యాలతో కరీంనగర్ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఆయనెప్పుడూ కరీంనగర్ అభివృద్ధికి సహకరించలేదని, ధర్మం ధర్మం అని చెప్పుకునుడే తప్పా.. ఏనాడు రూపాయి ఇవ్వలేదన్నారు. అందుకే బండి సంజయ్ మూడోసారి సక్సెస్ ఫుల్ గా ఓడిపోతున్నారని, అసలు బండి సంజయ్ కి ఓటు అడిగే హక్కులేదన్నారు. మంగళవారం కొత్తపల్లి లో బండి సంజయ్ గుండాలను వెంటపెట్టుకుని విచ్చల విడిగా డబ్బులు, మద్యం పంచి.. ఇప్పుడు మేమే డబ్బులు పంచుతున్నామని ఆరోపిస్తున్నారు. Also read :Voting: ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏంటో తెలుసా? బండి సంజయ్ డబ్బులు పంచుతున్నట్లు సిసి ఫుటేజ్ లోనూ రికార్డ్ అయింది. డబ్బులు పంచుతుండగా అడ్డంగా దొరికిన నీవు.. చట్టాన్ని నువ్వు ఎలా తీసుకుంటావ్? ఒకవేళ ఇది అబద్ధమైతే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? అని సవాల్ విసిరారు. ఏది ఏమైనా వంద శాతం బండి సంజయ్ నువ్వు ఓడిపోతున్నావ్ అంటూ ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) ప్రభుత్వం మీద జనాలు చాలా కోపంమీదున్నారని, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే అన్నారు. అభివృద్ధి అంటే వ్యక్తిగతంగా ఎదగడం కాదు.. ప్రజలు, పట్టణం, పల్లెలు డెవలప్ కావాలన్నారు. ఈ విషయంలో బండి సంజయ్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు గంగుల కమలాకర్. #gangula-kamalakar #bandi-sanjay #bhagyalakshmi-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి