Ganesh immersion : గణేష్‌ నిమజ్జనం లో రెచ్చిపోయిన పోలీసులు.. పిడిగుద్దులు గుద్దుతూ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోలీసులు రెచ్చిపోయారు. యువకులపై పిడిగుద్దులు గుద్దుతూ వార్నింగ్‌ ఇచ్చారు.  ఖమ్మం. కర్నూలు జిల్లాల్లో నిమజ్జన ఊరేగింపులో ఓ డీజే వ్యాన్ డ్రైవర్ల పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.

New Update
Police angered by Ganesh immersion

Police angered by Ganesh immersion

Ganesh immersion : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోలీసులు రెచ్చిపోయారు. యువకులపై పిడిగుద్దులు గుద్దుతూ వార్నింగ్‌ ఇచ్చారు.  మండల కేంద్రంలో జరిగిన నిమజ్జన ఊరేగింపులో ఓ డీజే వ్యాన్ డ్రైవర్ పై సీఐ పింగళి నాగరాజు రెడ్డి  తీవ్రంగా గాయపర్చడంతో పాటు యువకులకు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అశ్వారావుపేట  మండలం పేరాయి గూడెం దళితవాడలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం నిమజ్జనం కోసం సోమవారం రాత్రి యువకులు ఊరేగింపుగా బయలుదేరారు. అయితే రింగ్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఎస్సై ఊకే రామ్మూర్తి పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే వరకు డీజేను ఆపాల్సిందిగా ఆదేశించారు. ఎస్‌ ఐ చెప్పినట్లే  డీజేను ఆపిన యువకులు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న వినాయకుని గుడి వద్ద నుంచి తిరిగి డీజేను ఆన్‌ చేశారు.  పాటాకులు  కాలుస్తూ సంబురంగా వెళుతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్ఐ రామ్మూర్తి ఆవేశంగా వచ్చి కొంతమంది యువకులపై చేయి చేసుకున్నారు. దీంతో తిరగబడ్డ యువకులు.. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు.  పాటాకులు కాల్చడం వల్ల కరెంటు తీగలు దెబ్బతింటాయని ఎస్సై సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన యువకులు ఎలాంటి కారణం లేకుండా చేయి చేసుకున్నందుకు ఎస్సైను క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొద్దిసేపు వాగ్వాదం అనంతరం ఎస్సై అక్కడినుండి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత ఊరేగింపు సంత మార్కెట్ దగ్గరలోకి చేరుకోగానే  సీఐ పింగళి నాగరాజు అక్కడికి చేరుకున్నాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే రెడ్డి డీజే వాహనం డ్రైవర్ పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో యువకులు ఎదురు తిరిగి పదేపదే ఊరేగింపుకు అడ్డుపడి మాపై ఎందుకు దాడులు చేస్తున్నారంటూ  ప్రశ్నించారు. అయితే రాత్రి 10 గంటల వరకే డీజేకు అనుమతి ఉందని సీఐ చెప్పారు. అయితే ఊరు శివారుకు  చేరుకున్న ఊరేగింపు ముగిసే సమయంలో వచ్చి ఇలా దాడులు చేయడం ఏంటని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.  దీంతో రెచ్చిపోయిన సీఐ.. మా ఎస్సై గారు సారీ చెప్పాలా మీకు..? ఎవడ్రా ఎవడు సారీ చెప్పమన్నది. సారీ అని అన్నది ఎవడు..? చెప్తున్నా మా ఎస్ఐ గారిని సారి చెప్పమని అడిగిన వాడిని రేపొద్దున్న ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. డీజే వాన్ డ్రైవర్ పై సీఐ పిడిగుద్దులు.. యువకులకు వార్నింగ్ ఇస్తున్న వీడియోలు మంగళవారం వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. పోలీసుల తీరుపై పలువురు మండిపడుతున్నారు.

కర్నూలులోనూ...

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోనూ పోలీసుల ఓవరాక్షన్ చేశారు.గణేష్ నిమజ్జనంలో భక్తులు, నిర్వాహకులపై బూతులతో రెచ్చిపోయిన పోలీసులు ఇష్టం వచ్చినట్లు తిట్ల దండకం అందుకున్నారు. సీఐ శ్రీనివాసులు విచక్షణ రహితంగా బూటు కాళ్లతో తంతూ, బూతుపురాణం తో రెచ్చిపోయారు. సీఐ వ్యవహార శైలిపై హిందూ వాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.కాగా సీఐ దాడి చేసిన దృశ్యాలు  షోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాలుగు రోజుల క్రితం ఎమ్మిగనూరులో జరిగిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో ఈ సంఘనట చోటుచేసుకున్నట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు