Khairathabad Ganesh: బడా గణేశుడిని చూశారా?.. ఈ సారి స్పెషల్ ఏంటో తెలుసా? VIDEO

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి.

author-image
By K Mohan
New Update
bada ganesh khairatabad

Khairatabad bada ganesh

గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 'శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి'గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య రూపుదిద్దుకుంటున్నాడు. ఈ విగ్రహం నిర్మాణ పనులు సోమవారం( ఆగస్ట్ 25)న కళ్లు దిద్దడంతో పూర్తి అయ్యాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్ విగ్రహం తయారీ పూర్తి అవ్వడంతో కళాకారులు సోమవారం ఉదయం నేత్రోత్సవం నిర్వహించారు. ఆ గణేషుడికి పూజ చేసి ఆగమాన్‌ కార్యక్రమం చేశారు.

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 71వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం 'విశ్వశాంతి మహాశక్తి గణపతి' రూపాన్ని ఎంచుకున్నారు. విగ్రహాన్ని పూర్తిగా పర్యావరణహితమైన మట్టి, సహజ రంగులతో తయారు చేస్తున్నారు. గుజరాత్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన 1000 సంచులకు పైగా మట్టిని ఈ విగ్రహ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. విగ్రహం రూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది.

గణపతి మూడు తలలతో, నిల్చున్నట్లగా కనిపిస్తారు. తలపై పడగవిప్పిన ఐదు సర్పాలు, మొత్తం ఎనిమిది చేతులు ఉంటాయి. ఈ విగ్రహానికి కుడివైపున శ్రీ లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు, ఎడమవైపున లక్ష్మీదేవి, పార్వతి విగ్రహాలు ఉంటాయి. అలాగే, పూరీ జగన్నాథ స్వామి విగ్రహం కూడా మండపంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు దాదాపు 125 మంది కళాకారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వినాయక చవితి ఆగస్టు 27న ప్రారంభమై, సెప్టెంబర్ 6న నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ పది రోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి కూడా సురక్షితమైన, పర్యావరణ హితమైన నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు