Hyderabad:హైదరాబాద్‌నూ ముంచెత్తిన పొగమంచు.. 37 విమానాలు రద్దు పొగమంచు దేశంలో మిగతా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌ను కూడా కమ్మేసింది. దీంతో ఇక్కడ కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాలు ఫ్లై అవ్వడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా విమానాలు రద్దు అవుతున్నాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. By Manogna alamuru 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Flights cancel:అమెరికాను మంచు తుపాను ముంచేస్తుంటే మన దేశం మాత్రం పొగమంచులో కూరుకుపోయింది. దీని కారణంగా విమాన సర్వీసులు ఆగిపోతున్నాయి. లేదా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దీని గురించి చాలానే వార్తలు వస్తున్నాయి. మవిమానాల్లో గొడవలు అవుతున్నాయి. ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కు కూడా ఈ కష్టాలు వచ్చాయి. పొగమంచు కారణంగా హైదరాబాద్ నుంచి కూడా పలు ఫ్లైట్ సర్వీసులు రద్దు అయ్యాయి. అయితే ఈ రద్దు, ఆలస్యాల గురించి ముందుగానే చెప్పకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. Also read:ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా మెస్సీ..మూడోసారి ఎంపికయిన స్టార్ ఆటగాడు 37 ఫ్లైట్లు రద్దు... హైదరాబాద్ నుంచి వేర్వేరు రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్లు ఈరోజు రద్దు అయ్యాయి. వీటి కోసం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటున్న ప్రయాణికులు వెయిట్ చేసి వెయిట్ చేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదివారం నుంచి నిన్న సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి 37 ఫ్లైట్లు రద్దు అయ్యాయి. ఆదివారం పద్నాలుగు.. సోమవారం పదిహేను విమానాలు రద్దయ్యాయి. నిన్న 8 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే విమానాలు కూడా రద్దు అయ్యాయి అంటే అర్ధ చేసుకోవచ్చు పొగమంచు ఎంతలా ఇబ్బంది పెడుతోందో. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని...విమానాలు రద్దు అవ్వొచ్చని ఎయిర్ పోర్ట్ సర్వీస్ చెబుతోంది. జీరో విజిబిలిటీ... ఉత్తరాది రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో అయితే ఇది మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక డిల్లీ , ముంబైల్లో అయితే జీరో విజిబిలిటీ ఉంది. ఢిల్లీ, ముంబై, ఇండోర్లలో 10 విమానాలు రద్దు చేశారు. మరో 120 ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు ఆలస్యమైన వారికి టైమ్‌కు సమాచారం అందడం లేదు. దీంతో విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్స్ దగ్గర ప్రయాణికుల రద్దీ నెలకొంటోంది. డిపార్చర్ హాల్లో ప్రయాణికులు కూర్చోవడానికి స్థలం ఉండడం లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా, ఏమీ కనిపించనంతగా పొగమంచు కమ్ముకుని ఉంటోంది. #fog #cancelled #airport #flights #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి