Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు.
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది.
కర్ణాటకలో వర్షాల దంచికొడుతున్నాయి. దిగువకు భారీగా వరద ప్రవహించడంతో జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు కృష్ణా నది పరుగులు తీస్తోంది.
భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద చేరుతోంది. ఉదయం 7 గంటలకు 37 అడుగులకు నీటి మట్టం చేరింది. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్ల ఎత్తివేశారు.
చైనాలో ఆకస్మిక వరదల కారణంగా.. షాంగ్సీ ప్రావిన్స్లోని ఓ వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయలపాలయ్యారు. అలాగే వంతెన కింద ఉన్న నదిలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది శనివారం తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది.
ఆగకుండా పడుతున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. దానికి తోడు గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీరు గోదావరి జిల్లాలవారికి ఆందోళన కలిగిస్తోంది. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడడంతో..విలీన మండలాలకు ముప్పు తప్పేలా కనిపించడం లేదు.