Delhi: ఢిల్లీలో వరదలు..ముగ్గురు విద్యార్ధులు మృతి ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్‌మెంట్‌లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. By Manogna alamuru 28 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Old Rajender Nagar incident: నిన్న సాయంత్రం ఢిల్లీలో పడిన భారీ వర్షం కారణంగా రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్ మెంట్ వరద నీటితో నిండిపోయింది. ఈ నీటిలో మొత్తం 30మంది విద్యార్ధులు చిక్కుకుపోయారు. వారిలో 27మంది తప్పించుకోగా...ముగ్గురు విద్యారధులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కాగా ఒకరు అబ్బాయి. రాత్రి ఏడుంపావు గంటల సమయంలో కోచింగ్ సెంటర్‌లో విద్యార్ధులు చిక్కుకుపోయారని.. రాజేంద్రనగర్ ఫైర్ ఆఫీస్‌కు కాల్ వచ్చింది. వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లను అక్కడకు పంపించారు. అక్కడ వారు వెంటనే రెస్క్యూ ఆపేషన్ కూడా ప్రారంభించారు. కొన్నింగల తర్వాత ఫైర్ సిబ్బంది విద్యార్ధుల మృత దేహాలను బయటకు తీయగలిగారు. #WATCH | Delhi: On the Old Rajender Nagar incident, DCP Central M Harshavardhan says, "... The bodies have been sent to the hospital for further legal action. Rescue operations are still underway. The water is being pumped out. There is still about 7 feet of water in the… pic.twitter.com/37un19ApIJ — ANI (@ANI) July 27, 2024 మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఇంకా కోచింగ్ సెంటర్ దగ్గర సహాయక చర్యలు కొనసాగింారు. నీటిని అంతా బయటకు పంపడానికి ప్రయత్నం చేశారు. ఇంకా కొంత మంది బేస్ మెంట్‌లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమకు అందిన సమాచారం మేరకు అందరు విద్యార్ధులూ సురక్షితంగా బయటకు వచ్చారని..కేవలం ముగ్గురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ ఢిల్లీ) M హర్షవర్ధన్ తెలిపారు. #WATCH | Old Rajender Nagar incident | Delhi: Rescue and search operations are underway at the IAS coaching centre in Old Rajender Nagar where three students lost their lives after the basement was filled with water. (Morning visuals from the spot) pic.twitter.com/nlH2RAR4nW — ANI (@ANI) July 28, 2024 ఈ ఘటనపై ఢిల్లీ ఆప్ మినిస్టర్ అతిషి వెంటనే స్పందించారు. స్థానిక AAP ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారని, అలాగే మేయర్ షెల్లీ ఒబెరాయ్ కూడా చేరుకున్నారని చెప్పారు. ఈ ఘటనలో దోషలుగా తేలిన వారిని విడిచిపెట్టమని మంత్రి అతిషి చెప్పారు. #WATCH | Old Rajender Nagar Incident | Delhi: Students continue to protest against the MCD and the coaching institute where three students lost their lives after the basement of the institute was filled with water yesterday pic.twitter.com/9Erd7TgOAt — ANI (@ANI) July 28, 2024 Also Read:Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండకకు లక్ష్యసేన్ #delhi #died #floods #coaching-center #students #heavy-rain మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి