ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే కొంతమంది వ్యాయామం చేస్తారు.. మరికొందరు లైట్ తీసుకుంటారు. అయితే కనీసం ఉదయం పూట పదినిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా ఆరోగ్యానికి మంచిదని నిపుణలు చెబుతున్నారు. దీనికి మహిళలు, పురుషులకు ఎలాంటి మినహాయింపు లేదు. ఎవరైనా స్కిప్పింగ్ చేయవచ్చు. ఇక నిపుణలు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే.. ప్రతిరోజూ ఉదయం ఒక 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. జీవక్రియ కూడా త్వరగా ప్రారంభమవుతుంది. ఇతర వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేకుండానే కేవలం ఒక్క స్కిప్పింగ్ చేసినా కూడా ఫిట్నెస్ ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు స్కి్ప్పింగ్ అనేది గుండెకు చాలా మంచి వ్యాయామం. శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వును కూడా తొలగించేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Health Tips: ఉదయాన్నే స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయమం చేయడం తప్పనిసరి. చాలామంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది ఇవ్వన్నీ మనవల్ల అయ్యే పనులు కావంటూ వదిలేస్తారు. అయితే కనీసం ప్రతిరోజూ ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా మంచిదని చెబుతున్నారు నిపుణలు.
Translate this News: