IED Blast : నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి!
ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ బాంబు దాడిలో మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.