Amit Shah : ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన ట్వీట్

ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.  2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్‌కౌంటర్‌ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు.

New Update
shah amit

shah amit Photograph: (shah amit)

ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.  2026 మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్‌కౌంటర్‌ను "నక్సలిజానికి మరో బలమైన దెబ్బ" అని అభివర్ణించారు.  నక్సల్ రహిత భారత్‌ను నిర్మించడంలో తమ భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అమిత్‌ షా ప్రసంశలు కురిపించారు.  మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు.  నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.  దేశంలో నక్సలిజం చివరి దశకు చేరిందని అమిత్ షా అభిప్రాయపడ్దారు.

ఒడిశాలోని నువాపాడా జిల్లాకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్‌లో భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా జనవరి 19 రాత్రి ఆపరేషన్ ప్రారంభించింది.  భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.  మరణించిన ఇద్దరు మహిళలు సోనాబెడా-ధరంబంధ కమిటీకి చెందినవారని తేలింది.  కోటి రూపాయల రివార్డుతో నక్సల్ టాప్ కమాండర్ జయరామ్ అలియాస్ చలపతి కూడా హతమయ్యాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నక్సల్స్ వైపు నుంచి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మాట్లాడుతూ, 2024లోనే రాష్ట్రంలో కనీసం 220 మంది నక్సలిటీలు మరణించారని, గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు మరణించారని చెప్పారు.  తాజా  ఎన్‌కౌంటర్‌లతో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా, గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు.  అంతేకాకుండా, 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా, 837 మంది లొంగిపోయారు.

Also Read :  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీఖాన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు