ట్విటర్ ఆఫీస్ వస్తువులను వేలం వేయనున్న మస్క్!
ట్విటర్ ఆఫీస్ వస్తువులన్నింటినీ వేలం వేయనున్నట్టు ఎలోన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ బర్డ్, ప్రొజెక్టర్, ఐమాక్ డిస్ప్లే, కాఫీ మెషీన్లు వంటి వస్తువులు జనవరిలో వేలం వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వేలం 25 నుండి 50 డాలర్లకు ప్రారంభమవుతుందని మస్క్ వెల్లడించారు.