Musk : వాళ్ల పై హత్యాయత్నాలు ఎందుకు జరగట్లేదో.. మస్క్ పోస్ట్ వైరల్ డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంపై స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని మస్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. By Bhavana 16 Sep 2024 | నవీకరించబడింది పై 16 Sep 2024 11:37 IST in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Elon Musk: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఈ విషయం గురించి స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని మస్క్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైనా ఎవరూ కాల్పులు జరపడంలేదేమని సోషల్ మీడియా వేదికగా ఆయన కామెంట్ చేశారు. . ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం ట్వీట్ చేశారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్ చేసిన పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మరోమారు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన విషయం తెలిసిందే. And no one is even trying to assassinate Biden/Kamala 🤔 https://t.co/ANQJj4hNgW — Elon Musk (@elonmusk) September 16, 2024 ఆయనకు ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయనతో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రసారమయ్యే సమయంలో ట్విట్టర్ పై సైబర్ దాడి జరగడంతో చాలామంది ట్రంప్ అభిమానులకు అది చేరలేదు. #elon-musk #america #donald-trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి