Jharkhand Earthquake: జార్ఖండ్‌ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు
జార్ఖండ్‌లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
జార్ఖండ్‌లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. దాదాపు 5 సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.
తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో 9.7 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించగా రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భూకంపం ప్రభావంతో అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈరోజు తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.
శుక్రవారం జరిగిన పపువా న్యూగినీలోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 2 వేలకు చేరింది. మారుమూల ప్రాంతం కావడంతో పాటు 26 అడుగుల ఎత్తు వరకు చెత్తాచెదారం పేరుకుపోవడంతో రెస్క్యూ టీంకు సహాయక చర్యల పై తీవ్ర జాప్యం జరుగుతుంది.
తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్షిప్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం రోజు కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5సార్లు భూమి కంపించినట్లు నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. ఇక్కడే రెండు వారాల కిందట భూకంపంతో 700 మందికిపైగా గాయాలయ్యాయి.
జమ్మూకాశ్మీర్ ప్రజలు వరుస భూకంపాలతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆరు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత 3.2 నుంచి 2.6 మధ్య నమోదైంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.