Earthquake:ఏపీలో మరోసారి భూకంపం కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం కేంద్రంగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. శనివారం ఇదే జిల్లాలోని తుళ్లూరు మండల పరిధిలో 3 సెకన్లు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. శంకరాపురం, పోలవరం , పసుపుగల్లులో భూమి కంపించినట్లుగా గ్రామ ప్రజలు తెలిపారు.
వరుస భూకంపాలు:
ముండ్లమూరు మండల పరిధిలోని మారెళ్ల, ముండ్లమూరు, తుర్పు కంభంపాడు, వేంపాడు, శంకరాపురంలో స్వల్పంగా భూమి కంపించింది. ముండ్లమూరు పాఠశాలలో విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు కూడా భయంతో వణికిపోయారు. వరుసగా రెండో రోజు ముండ్లమూరు పరిధిలో భూకంపం రావడంతో అసలు ఏం జరుగుతోందని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామ ప్రజలు.
ఇది కూడా చదవండి: పెరుగును నేరుగా ముఖంపై అప్లై చేస్తే ఏమవుతుంది?
రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ తెలిపింది. ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకిలో భూకంప కేంద్రం ఉంది. ముండ్లమూరులో సుమారు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టుగా స్థానికులు పేర్కొన్నారు.గతంలో ఎప్పుడూ ఎదురుకాని విపత్తు ఇప్పుడు సంభవించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో భూమి కంపించడం రెండోసారి దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల తెలంగాణతో పాటు ఏపీలో భూకంపం చోటుచేసుకుంది. ఇది మరిచిపోకముందే మళ్ళీ ఇప్పుడు భూమి కంపించింది. ఇలా వరుస భూకంపాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భూకంప సమయంలో..
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ప్రకృతి విపత్తులతో సతమతం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంప భయం పట్టుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందా..? ఒక్కసారిగా భూమి ఎందుకు కంపిస్తోంది..? భూకంప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: కాఫీ ఎక్కువగా తాగితే బీపీ తప్పదా?