బీజేపీ కొత్త కమిటీ.. ఎంపీ డీకే అరుణ సంచలన కామెంట్స్!-VIDEO

బీజేపీ రాష్ట్ర కమిటీకి తాను ఎవరి పేరు కూడా ప్రతిపాదించలేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ పదవులు వచ్చిన వాళ్లకే నాయకత్వానికి అర్హత ఉంది.. మిగతా వాళ్లకు లేదని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు.

New Update
DK Aruna

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆనాడు కండువా కప్పుకొని పార్టీ మారి.. ఈరోజు అది దేవుడి కండువా అంటూ బుకాయిస్తారా? అని ప్రశ్నించారు. ఇంత నీచ రాజకీయం తాము ఎప్పుడూ చూడలేదని ఫైర్ అయ్యారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారకుంటే ఈరోజు గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీటింగ్ కు వెళ్లాలన్నారు. గద్వాలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన అబివృద్ధి ఏమీ లేదన్నారు. గద్వాల ప్రజలను అడిగితే ఈ విషయం చెబుతారన్నారు. దాచిపెడితే దాగే విషయం ఇది కాదన్నారు. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలన్నారు. 20 నెలల తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన అనంతరం సీబీఐ విచారణకు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకమని అన్నారు. రాష్ట్ర కమిటీకి తాను ఎవరి పేరు కూడా ప్రతిపాదించలేదన్నారు. పార్టీ పదవులు వచ్చిన వాళ్లకే నాయకత్వానికి అర్హత ఉంది.. మిగతా వాళ్లకు లేదని అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేపు మాపో కవిత కుటుంబంతో కలవడం ఖాయమన్నారు. ఆమె గురించి అంత స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కవిత గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు రోజుల్లో తల్లీపిల్లలు కలుస్తారన్నారు. 

Advertisment
తాజా కథనాలు