కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య
ధనుష్, ఐశ్వర్య విడాకుల దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.