కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య

ధనుష్, ఐశ్వర్య విడాకుల దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

New Update
da

కోలీవుడ్ స్టార్ సెలెబ్రిటీ జంట ధనుష్ - ఐశ్వర్య విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు 18 ఏళ్ళు కలిసున్న ఈ జంట 2022 జనవరిలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.' 18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. 

ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం..' అంటూ పేర్కొన్నారు. ఇక విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకోగా.. వీరి దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది.

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

ఆ రోజే తుది తీర్పు..

విచారణకు వీరిద్దరూ తొలిసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ రోజే తుది తీర్పును కోర్టు వెల్లడించనుంది. 

Also Read :  తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!

ధనుష్ - ఐశ్వర్య 2004 నవంబర్‌ 18న వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. 

Also Read: నేను ఇలాగే మాట్లాడతా, ఎవ్వరూ ఏం పీకలేరు.. వాళ్లపై విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్

Also Read :  నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు