Dhanush: సైలెంట్ గా ధనుష్ కొత్త మూవీ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది..! స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఇడ్లీ కడై'. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 09 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Dhanush Idli kadai షేర్ చేయండి Dhanush Idli Kadai : కోలీవుడ్ స్టార్ ధనుష్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'రాయన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ గ్యాప్ లోనే సైలెంట్ గా 'ఇడ్లీ కడై' అనే టైటిల్ తో మరో కొత్త సినిమాను పట్టాలెక్కించి ఫ్యాన్స్ సప్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కూడా ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ధనుష్ సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ తాటాకుల పైకప్పుతో ఉన్న చిన్న ఇంటి వైపు వెళ్తున్న లుక్ ఆసక్తిని రేపుతోంది. అసలు ఈ సినిమా కాసెప్ట్ ఎలా ఉండబోతుందా..? అనే క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా మరో కీలక పాత్రను పోషించగా.. కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. #idlikadai release announcement pic.twitter.com/iNKNmfridz — Dhanush (@dhanushkraja) November 8, 2024 Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! Also Read: 'సిటాడెల్' లో సెమీ న్యూడ్ సీన్స్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్.. వరుణ్ రిప్లై వైరల్..! #dhanush #kollywood #idli-kadai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి