Mallu Ravi : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా..!
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ కు రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు.