/rtv/media/media_files/2026/01/02/fotojet-5-2026-01-02-21-29-23.jpg)
Young And Fit Indians Are Falling Prey To Sudden Cardiac Arrest
Explainer:ఈ మధ్య కాలంలో యువత నడివయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ధృడమైన శరీరాలు కలిగిన30 ఏళ్లలోపు వ్యక్తుల ఊహించని మరణాల వెనుక గుండెపోటు కారణమనే వాదన ఉంది. యువకులు ఆకస్మిక కుప్పకూలిపోవడం, మరణించడం భారతదేశంలో అత్యంత కలవరపెట్టే వైద్య వాస్తవాలలో ఒకటిగా మారింది. ఇది ఎలాంటి హెచ్చరిక, రోగ నిర్ధారణ లేదా స్పష్టమైన అనారోగ్యం లేకుండానే వస్తుందనేది ఆందోళన కలిగిస్తుంది. వైద్యులు దీనిని ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఇది వయస్సు, ఫిట్‌నెస్, సామాజిక ఆర్థిక సమస్యలతో సంబంధం లేకుండా కలగడమే. దీనికి ప్రధాన కారణం కరోనా, కరోనా వ్యాక్సినే అనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా జరుగుతుంది. కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తన పరిశోధనలో ఈ మరణాలకు సంబంధించి భయంకరమైన నిజాలను బయటపెట్టింది. కాగా దీనిపై ఎయిమ్స్ పరిశోధన చేసి నివేదిక విడుదల చేసింది.
గత రెండు సంవత్సరాలలో, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత, ఈ ఆందోళన సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా మరింత పెరిగింది - ప్రజలు కార్యకలాపాలు మధ్యలో కుప్పకూలి అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఒక వివాహంలో నృత్యం చేస్తున్న వ్యక్తి, బ్యాడ్మింటన్ కోర్టులో ఆటగాడు వాలిపోవడం, ఒక యువకుడు తన ఛాతీని పట్టుకుని పడిపోవడం - ఇలాంటి క్లిప్‌లు విస్తృతమైన భయాన్ని మరియు ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఢిల్లీలోని ఎయిమ్స్ తేల్చేసింది.
2018 నుంచి 2022 మధ్య జరిగిన 3,800కి పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. పరిశీలించిన అన్ని శవపరీక్షలలో, 180 మరణాలు (8.1%) ఆకస్మిక మరణానికి పలు కారణాలున్నాయని తేలింది.పరిశోధకులను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే వయస్సు ప్రొఫైల్: ఈ మరణాలలో 103 - 57.2% - 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో సంభవించాయి, వారిలోదాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని తేల్చి చెప్పింది. దీంతో ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్న అపోహలన్నీ అబద్ధమని తేల్చింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6%, ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో 21.5%, ఇతర కారణాల తో 35.9% మంది చనిపోయారని నివేదిక తేల్చింది. వీరందరి చావుకి కోవిడ్ అసలు కారణమే కాదని రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఒకప్పుడు వృద్ధాప్యం కారణాంగానే గుండె జబ్బులు వస్తాయి అనుకున్న సమస్య ఇప్పుడు యంగ్ ఇండియాను దహించివేస్తోంది.దీనికి ప్రధాన కారణం ప్రస్తుత లైఫ్‌స్టైలే అంటున్నారు వైద్యులు. మారుతున్న లైఫ్‌స్టైల్, సిగరెట్, మద్యం, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ ఇవన్నీ యూత్ ను రిస్క్ లోకి దించుతున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 2018 నుంచి 2022 మధ్యలో మరణించిన యువతలో 57 శాతం స్మోకింగ్, 52 శాతం ఆల్కహల్ సేవించే వారు ఉన్నట్లు ఎయిమ్స్ పరిశోధన తేల్చింది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయనీ, వ్యాయామం వదిలేశారని.. అందుకే గుండె నిట్టూరుస్తోందంటున్నారు.ఈ అజాగ్రత్తే గుండెపోటును ఆహ్వానిస్తోంది అని వారు తేల్చి చెప్పారు.
యువకులు గుండె వ్యాధులను మాములుగా తీసుకోకుండా సిగరెట్,ఆల్కహాల్ అలవాటును మానేసి..ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యుల సలహా ఇస్తున్నారు. ఐతే ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసు వారే సడెన్ డెత్స్ తో చనిపోతున్నారని.. పిల్లల లైఫ్ స్టైల్ లో మార్పు రాకపోతే చిన్నారుల్లో కూడా ఈ సడెన్ డెత్స్ తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచే వ్యాయామంతో మైండ్ బాడీని ఉత్సాహఃగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు, మొబైల్స్, టీవీలు చూడటం తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ పై దృష్టి పెట్టాలని తల్లి తండ్రుల కు వైద్యులు సూచిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని ముఖ్యంగా.. ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.AIIMS అధ్యయనం ప్రకారం ప్రస్తుత చావులకు కరోనాకు ఎలాంటి సంబంధం లేదని, ఆహారపు అలవాట్లు, వ్యాయమం, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలే అకస్మిక మరణాలకు కారణాలని తేల్చింది. అందుకే అందరూ జాగ్రత్త పడాలని హెచ్చరిస్తుంది తాజా ఎయిమ్స్ రిపోర్ట్.
Follow Us