Delhi AIIMS: అందరూ సేఫ్
పూర్తిగా చదవండి..దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్(Delhi AIIMS) ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆంతస్తులో కరోనా శాంపిల్స్ సేకరించే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతేకాకుండా వివిధ టెస్టింగ్ సెక్షన్, డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, బిల్డింగ్‌లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి స్థానికులు ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది 22 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన చోట ఎయిమ్స్ సెట్ సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. దీంతో 22 అగ్నిమాపక యంత్రాల ద్వారా అధికారులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వరస ఘటనలు
ఇటీవలలో తరుచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదపు ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినా సందర్భాలు ఉన్నాయి. గత నెల సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ఏరియాలో ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బరాకాంబా రోడ్డులోని డీసీఎం బిల్డింగ్ తొమ్మిదో అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ నుంచి అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో 10 ఫైరింజిన్లు ప్రమాద స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నాయి. వరుసగా ఢిల్లీలో అగ్ని ప్రమాదాలతో రాజధాని వాసులందరిని టెన్షన్‌కి గురి చేస్తోంది.
Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ.. రాజ్యసభలో ప్రవేశపెట్టిన అమిత్‌షా
[vuukle]