Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్‌ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. By Karthik 25 Sep 2023 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్‌ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. ఎలాంటి తప్పు చేయని తన భర్తను 17 రోజుల నుంచి జైల్లో నిర్భందిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తన కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదన్నారు. తాను సొంతంగా నడుపుకుంటున్న కంపెనీలో 2 శాతం అమ్ముకున్నా తనకు 400 కోట్లు వస్తాయన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు తనకు మానవుడే దేవుడు మనుషులే దేవుళ్ళు అని చెప్పారని భువనేశ్వరి గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్‌ను స్థాపించారన్నారు. మా కుటుంబం అంతా ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నామని తెలిపారు. మరోవైపు పోలీసులపై ఫైర్ అయిన భువనేశ్వరి.. పోలీసులు ఐటీ ఉద్యోగులను ఎందుకు నిర్భందిస్తున్నారని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగులను ఏమైనా టెర్రరిస్టులా అన్నారు. ఐటీ ఉద్యోగులు రాష్ట్రానికి రావాలంటే వీసా పాస్ పోర్ట్ కావాలా అని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో లేదా అన్నారు. చంద్రబాబు నాయుడు రాళ్ల రప్పల మధ్య ఐటెక్ సిటీని నిర్మించారన్న భువనేశ్వరి.. ఇప్పుడు అది సైబారాబాద్గా మారిందన్నారు. అప్పటి చంద్రబాబు నాయుడి ఆలోచన తీరు వల్ల ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతోందన్నారు. విజన్ 2020ని చంద్రబాబు 10 సంత్సరాల ముందే స్థాపించారన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క ఐటీ రంగాన్నే కాకుండా అన్ని రంగాలను అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. మహిళలు అంటే ఓ శక్తి అన్న భువనేశ్వరి.. తాను ఓ ఝాన్సీ లక్ష్మిభాయ్లా పోరాటం చేస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం తన భర్తను అనవసరంగా రెచ్చగొడుతొందన్న నారా భువనేశ్వరీ.. రాష్ట్ర ప్రజలు వారి ఓటును వారు కాపాడుకోవాని సూచించారు. #ntr #itech-city #bhubaneswari #chandrababu #cyberabad #skill-development #it-jobs #nara-lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి