యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. భార్యకు గర్భస్రావం (వీడియో)
ముంబైలో కుటుంబం ముందే యువకుడిని ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. అడ్డొచ్చిన భార్యను కొట్టగా గర్భస్రావం అయింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో మృతి చెందాడు. ఇదంతా కేవలం ఓవర్టేక్ చేసాడనే కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది.