UP: పాపం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు వైద్యులు మృతి! ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారుకు ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు డాక్టర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. By Vijaya Nimma 27 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update Car Accident షేర్ చేయండి UP Crime: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సైఫాయి మెడికల్ వర్సిటీకి చెందిన ఐదుగురు డాక్టర్లు మృతి చెందారు. డాక్టర్లందరూ లక్నో నుంచి తిరిగి వస్తూడగా తెల్లవారుజామున 3 గంటలకు స్కార్పియో డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలోనే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైది. ఈ ప్రమాదంలో అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత మృతుల కుటుంబాలకు సమాచారం అందించగా.. వారి కుటుంబాల్లో విషాధం నెలకొంది. సైఫాయి మెడికల్ వర్సిటీలో పీజీ విద్యార్థులు: ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డాక్ఱర్లు సైఫాయి మెడికల్ వర్సిటీలో పీజీ చదువుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే వర్సిటీ సిబ్బందితో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్‌కు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందించారని పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు డాక్టర్లలో ఆగ్రాకు చెందిన వారుగా గుర్తించారు. మోతీపూర్ కన్నౌజ్‌కు చెందిన అరుణ్ కుమార్, అనిరుధ్ వర్మ, న్యూ క్యాంపస్ రిమ్స్ సైఫాయికి చెందిన సంతోష్ కుమార్ మౌర్య, బరేలీకి చెందిన డాక్టర్ నార్దేవ్, మొరాదాబాద్‌కు చెందిన జైవీర్‌సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read: భూమిలో పెరిగే ఈ దుంప తింటే.. హెల్దీ ఆరోగ్యం మీ సొంతం అయితే ప్రమాదంపై విచారణ చేయగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ దారుణం జరిగిందని తేలింది. స్కార్పియో నంబర్ 80 HB 0703 కాగా.. కారును ఢీకొన్న ట్రక్క్ నెంబర్ RJ 09 CD 3455. అందరూ లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. డాక్టర్ల కారు ఎక్స్‌ప్రెస్‌వేపై మిడిల్ డివైడర్‌ను దాటి అవతలి వైపుకు వెళ్లింది ఈ సమయంలో కారు వెనుక నుంచి అతివేగంతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. ఘటనపై సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా.? లేదా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న సమయంలో జరిగిందా? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: ఒక్క ఆకుతో ఎంతో రోగనిరోధకశక్తి మీ సొంతం #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి