కడపలో దారుణ హత్య
సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.
సొంత అన్ననే హత్య చేసిన దారుణ ఘటన కడప జిల్లా మైదకూరులో చోటుచేసుకుంది. అప్పు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది ముదరడంతో.. తమ్ముడు బాలరాజు అన్న నారాయణ యాదవ్‌ను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ప్రస్తుతం బాలరాజు పరారీలో ఉన్నాడు.
హైదరాబాద్‌లోని కోఠి గుజరాత్ గల్లీలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. మహ్మద్ అబ్దుల్, ఉత్తమ్ కుమార్, లలిత్ సింగ్ అనే వ్యాపారులు అనుమానాస్పదంగా ఓ బ్యాగ్‌ను తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగ్ లోని రూ.22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు.
సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలి అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్ రెడ్డి మృతి చెందాడు. ఆర్యన్ జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు.
యుఎస్‌కి చెందిన మెలిస్సా కర్టిస్ అనే మహిళా టీచర్ 14 ఏళ్ల విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి బలవంతంగా 20 సార్లు శృంగారంలో పాల్గొంది. ఈ కేసులో కోర్టు ఆమెకు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె టీచర్ వృత్తికి కూడా వీడ్కోలు పలకాలని తీర్పునిచ్చింది.
ఇప్పటి వరకు ఒక మనిషి దొంగతనం చేయడం చూశాం. కానీ తాజాగా ఒక రోబో ఇతర 12 రోబోట్లను కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనాలో జరిగిన ఈ ఘటనతో అంతా అవాక్కవుతున్నారు.
సీనియర్ న్యాయవాదిపై కొడవలితో నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోర్టు నుంచి వస్తుండగా.. ఆ ప్రాంగణంలోనే కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. ప్రస్తుతం న్యాయవాది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ కర్నూలు జిల్లా తంగరడోణ గ్రామంలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన వీరేష్.. ఇంట్లో డబ్బులు దొంగిలిచొద్దని హెచ్చరించిన 10 ఏళ్ల కూతురు గొంతుకు తాడు బిగించి చంపేశాడు. బాధితురాలి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.