Maharashtra: ఆడపిల్ల పుడితే భారం. అబ్బాయి పుడితే వరం అనే గుడ్డి అపోహల నుంచి కొంతమంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఆడపిల్లలు ప్రతి రంగంలోనూ అత్యన్నత స్థానాల్లో రాణిస్తున్న ఈ రోజుల్లో కూడా.. ఆడపిల్ల పుట్టడం దృదృష్టమని భావించే మూర్ఖులు ఉన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని కనీస మానవత్వం లేకుండా కట్టుకున్న భార్యకు నిప్పటించాడు ఓ దుర్మాగపు భర్త. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? మూడో సారి కూడా అమ్మాయి పుట్టిందని.. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా గంగాఖేడ్ నాకాలో కుండ్లిక్ ఉత్తమ్ కాలే (32) అనే వ్యక్తి భార్య మైనాను గురువారం రాత్రి నిప్పటించి చంపేశాడు. మైనా సోదరి చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తమ్ భార్య మైనాకు వరుసగా ఇద్దరు కూతుళ్ళ తర్వాత మూడోసారి కూడా కూతురే పుట్టింది. ముగుర్రు కుమార్తెలు కావడంతో ఉత్తమ్ తరచూ భార్యను అసహ్యించుకోవడం ఆమెతో గొడవపడటం చేసేవాడు. కాగా.. గురువారం రాత్రి వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన ఉత్తమ్ భార్య పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మైనా కేకలు వేస్తూ ఇంటి బయటకు వెళ్ళింది. వెంటనే స్థానికులు మంటలు ఆర్పీ ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా కాలిపోవడంతో మార్గం మధ్యలోనే మరణించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు కాలేను అరెస్టు చేసి గంగాఖేడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం!