Crime: దారుణం.. అక్క కాపురంలో అత్త చిచ్చు పెడుతుందని..
అక్క కాపురంలో అత్త చిచ్చు పెడుతుందని తమ్ముడు ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. అక్క, బావ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అత్త వల్లే గొడవలని ఆమె లేకపోతే సమస్యే ఉండదని భావించి అక్క తమ్ముడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
హనీమూన్ చిచ్చు.. అల్లుడిపై మామ యాసిడ్ దాడి
హనీమూన్ విషయంలో వివాదం చెలరేగడంతో మామ అల్లుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంట జమ్మూకశ్మీర్ వెళ్లాలని అనుకుంటే.. అమ్మాయి తండ్రి మతపరమైన ప్లేస్‌లకు వెళ్లాలన్నారు. ఈక్రమంలో మామ అల్లుడిపై యాసిడ్ దాడి చేశాడు.
మందు తాగించి అన్నను, నీళ్లలో ముంచి తమ్ముడిని.. ! | Sister Killed Brother For Father Assets | RTV
Palnadu District: ఆస్తి కోసం సొంత సోదరులనే.. ఏం చేసిందంటే?
పల్నాడు జిల్లాలో ఓ సోదరి ఆస్తి కోసం సొంత అన్నలను చంపేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి పక్షవాతంతో ఈ ఏడాది మరణించారు. ఆ డబ్బు తనకి మాత్రమే చెందాలని ఒకరిని చున్నీతో, ఇంకోరిని కాలువలో తోసేసి చంపేసింది.
వాటర్ ట్యాంక్ కూలి.. ముగ్గురు విద్యార్థులు మృతి
అరుణాచల్ ప్రదేశ్ పాఠశాలలో వాటర్ ట్యాంక్ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు!
శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లో చెలామణి చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి సహా మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
చైన్ స్నాచింగ్‌లో నయా ట్రెండ్.. కాలింగ్ బెల్ కొట్టి దోచేస్తారు
నర్సింగిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సన్‌సిటీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు. విజయ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది.